ఇండో–జపాన్ స్నేహబంధానికి కళలు వారధిగా నిలవాలి - వెంకట్ గడ్డం

 హిరోకో తకయామా కళాకృతులు అద్భుతం, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇండో–జపాన్ కళా ప్రదర్శనను సందర్శించిన మంత్రి వేక్ వెంకటస్వామి

ఇండో–జపాన్ స్నేహబంధానికి కళలు వారధిగా నిలవాలి - వెంకట్ గడ్డం

హైదరాబాద్: కళలు, సంస్కృతి రెండు దేశాల ప్రజల మధ్య స్నేహసంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందించడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ కళాకారుడు వెంకట్ గడ్డం, జపాన్‌కు చెందిన కళాకారిణి హిరోకో తకయామా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇండో–జపాన్ కళా ప్రదర్శనను బుధవారం ఆయన సందర్శించారు. ప్రదర్శనలోని పెయింటింగ్స్, వస్త్రాలపై రూపొందించిన కళాకృతులు, ఇతర కళారూపాలను ఆసక్తిగా తిలకించి కళాకారులను అభినందించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెంకట్ గడ్డం, హిరోకో తకయామా కళల ద్వారా ఇండో–జపాన్ స్నేహబంధాన్ని చాటిచెబుతున్న తీరు అభినందనీయమన్నారు. భారతీయ, జపనీస్ కళలు, సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. 

1

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు