నేడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం
– డీఎంహెచ్‌వో డాక్టర్ నరేంద్ర రాథోడ్ పిలుపు
నస్పూర్(మంచిర్యాల): జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 1న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ నరేంద్ర రాథోడ్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో చేపట్టనున్నఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్ర రాథోడ్ మాట్లాడుతూ...ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగి, కనీసం 45 కిలోల బరువు ఉన్న ఆరోగ్యవంతులైన పౌరులందరూ రక్తదానం చేయవచ్చని సూచించారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ స్వచ్ఛంద సేవా సంస్థలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


