శ్రీ కాళికాదేవి,నగరేశ్వర దేవాలయాల పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి, నగరేశ్వర దేవాలయాల నూతన పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దేవదాయ శఖ ఈవో టి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఆశావాహులు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తొ ఆయా దేవాలయాల చైర్మన్ పదవి కోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరివైపు ముగ్గు చూపుతే వారే దేవాలయాల చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పట్టణ కేంద్రంలో పొట్లీ మహారాజ్ దేవాలయం పాలకవర్గం సమయం పూర్తయిన కొత్త పాలకవర్గానికి నోటిఫి కేషన్ ఇంకా రాలేదు. ఈ దేవాలయం చైర్మెన్ ఎవ్వరికి ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. పట్టణంలోని సీతారాంపేట హనుమాన్ దేవాలయం పాలకవర్గం సమయం ముగిసిన నూతన ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడ లేదు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


