కొండూరులో వైభవంగా దేవి నవరాత్రులు.. 

మూడో రోజు అన్నపూర్ణ దేవిగా భక్తులకు అమ్మవారి దివ్యదర్శనం! ,  భక్తుల సేవ చేయడం పూర్వజన్మ సుకృతం ,  యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు కోడాల అల్వాల్ రెడ్డి

కొండూరులో వైభవంగా దేవి నవరాత్రులు.. 

నల్గొండ /మర్రిగూడ:మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా,ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. కొంగుబంగారమై కొలిచిన కొంగుల వెలుగొందుతున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం అమ్మవారు సర్వజగత్తుకూ ఆకలి తీర్చే జగన్మాత 'అన్నపూర్ణ దేవి' అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి,కుంకుమార్చనలు, హారతులు సమర్పించారు. "ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః" అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అమ్మవారి దివ్యరూపాన్ని కనులారా వీక్షించిన భక్తులు తరించిపోయారు. గ్రామ ప్రజలంతా ఏకమై నవరాత్రి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

ఘనంగా అన్నప్రసాద వితరణపూజా కార్యక్రమాల అనంతరం మూడో రోజు భక్తుల సౌకర్యార్థం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.మర్రిగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడాల అల్వాల్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన భక్తులందరికీ రుచికరమైన ప్రసాదాన్ని ప్రేమతో వడ్డించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, యువకులు ఈ అన్నప్రసాదంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం: కోడాల అల్వాల్ రెడ్డి ఈ సందర్భంగా మర్రిగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడాల అల్వాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు సేవ చేసే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. అన్నపూర్ణ దేవి కటాక్షంతో మండల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో, ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను గ్రామంలో మరింత విస్తృతంగా నిర్వహిస్తా నాయకులు, స్థానిక యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.మని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్, సభ్యులు, కొండూరు గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ

Views: 267

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు