ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటి విడుదలను బుధవారం ప్రారంభించారు.
నిజామాబాద్ :శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా బుధవారం నీటి విడుదలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..రోజు 5వేల క్యూసెక్కులు..రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. జగదీష్ తెలిపారు. 1,091 అడుగుల గరిష్ట నీటిమట్టం సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 1,079 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వరద కాలువ ఆయకట్టు పరిధిలోని గ్రామాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎస్ఈ సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


