యథేచ్ఛగా మట్టి / మొరం మాఫియా దందా
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని వెండికోల్,లింగంపల్లి, వెంకట కిష్టాపూర్ గ్రామాల శివారులోని కాముని చెరువు లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామాలలో రోడ్లు వేస్తున్నామంటూ పేరు చెప్పి, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని నమ్మబలుకుతూ కొందరు వ్యక్తులు గత నెల రోజులుగా టిప్పర్ల కొద్దీ మొరం, మట్టిని అక్రమంగా తరలించి బయటకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరుగుతోంది?
వెంకట కిష్టాపూర్, లింగంపల్లి, వెండికోల్ శివారులోని కాముని చెరువు లో పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి రాత్రి వరకు జేసీబీ లతో ఇటాచిలతో మట్టిని తవ్వి టిప్పర్లలో నింపుతు రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు వందల టిప్పర్ల వరకు మొరం బయటకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో రోడ్డు వేయడానికి కొద్దిపాటి మట్టి తీసుకెళ్తున్నామని మొదట చెప్పిన వారు,గ్రామ పంచాయతీ పర్మిషన్ మరియు మండల తహసీల్దార్ అనుమతులు లేకుండా ఇప్పుడు ఏకంగా దందాగా మార్చి వ్యాపారం చేస్తున్నారని వాపోతున్నారు..jpeg)
అధికారుల నిర్లక్ష్యం:
చౌటకూర్ మండల తహసీల్దార్ కు గ్రామ ప్రజలు పిర్యాదు చేయడం తో వుంటావుటిన వచ్చిన అధికారులు అక్కడి నుండి తిప్పర్లను తీసుకొచ్చి పోలీస్ స్టేటస్ కు తరలించకుండా గంటల తరబడి రోడ్ పై నిలబెట్టి ఏమ్ చేస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని, కళ్ళుండి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, పంట పొలాలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు..jpeg)
గ్రామస్తుల డిమాండ్:
ఈ అక్రమ మట్టి దందాపై వెంటనే జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు స్పందించి విచారణ జరిపి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామాల చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని వెండికోల్, లింగంపల్లి,వెంకట కిష్టాపూర్, గ్రామ ప్రజలు యువకులు యువజన సంఘాలు కోరుతున్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


