కేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
నిజామాబాద్ నగరం లోని కేర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాల విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు.భక్తితో బతుకమ్మను పేర్చి..బతుకమ్మ వేడుకల్లో భాగంగా నాల్గో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలను కళాశాలలో నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. పువ్వులను ఒక దేవతగా భావించి పూజించి పండుగ చేయడం ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన అని మహిళా అధ్యాపకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు అనురాధ, సునితారాణి, మౌనిక, గంగమణి, శ్రీవిద్య, శ్రీలత అరుణ, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


