ఫార్మ్ పాండ్స్ నిర్మాణంతో రైతులకు బహుళ ప్రయోజనాలు -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఫార్మ్ పాండ్స్ నిర్మాణంతో రైతులకు బహుళ ప్రయోజనాలు -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

స్టేషన్ ఘన్‌పూర్ :ఉద్యానవన పంటలతో పాటు ఇతర పంటల సాగుకు నీటి కొరత లేకుండా పొలాల్లో చిన్న నీటి నిల్వ చెరువులైన ఫార్మ్ పాండ్స్ నిర్మించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జనగామ జిల్లాలోని ఘన్‌పూర్ (స్టేషన్) మండలం, రంగరాయగూడెం గ్రామంలో వీబీజీ రామ్ జీ పథకం కింద చేపట్టిన ఫార్మ్ పాండ్స్ నిర్మాణ పనులను కలెక్టర్ సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫార్మ్ పాండ్స్ నిర్మాణం ప్రభుత్వ స్థలంలో చేపడుతున్నారా? లేదా? రైతుల సొంత భూముల్లో చేపడుతున్నారా? అనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులకు రోజువారీగా ఎంత మంది కూలీలు హాజరవుతున్నారని వారికి రోజుకు ఎంత కూలి లభిస్తుందనే వివరాలను ఆరా తీశారు. గ్రామానికి చెందిన రైతు ఎల్లగౌడ్ తన పొలంలో ఫార్మ్ పాండ్ నిర్మించగా, ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉందనే వివరాల గురించి ఆరా తీశారు. ఫార్మ్ పాండ్ నిర్మాణం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతును అడిగి తెలుసుకున్నారు. అలాగే తన బోరులో సరిపడా నీరు అందుబాటులో ఉందని, బావిలో నీటి కొరత లేకపోవడంతో పాటు నీటి మట్టం కూడా పెరిగిందని రైతు కలెక్టర్‌కు వివరించారు. తన భూమిలో వరి పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు. పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయిస్తున్నారని కలెక్టర్ అడగగా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నట్లు రైతు వివరించారు. అనంతరం ఫార్మ్ పాండ్స్ పొడవు, వెడల్పు, లోతుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత కొలతల ప్రకారం పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫార్మ్ పాండ్స్ తవ్వకాల ద్వారా వెలువడే మట్టిని గుంతలకు దూరంగా వేయాలని కూలీలకు సూచించారు. మట్టిని గుంతలకు సమీపంలో వేస్తే వర్షాల సమయంలో తిరిగి గుంతల్లోకి చేరే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫార్మ్ పాండ్స్ నిర్మాణాలను అధికంగా రైతుల పొలాల్లో చేపట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సమస్యలు తలెత్తకుండా, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు పని కల్పించి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం వీబీజీ రామ్ జీ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. నీటి సంరక్షణలో ఫార్మ్ పాండ్స్ కీలకంగా ఉపయోగపడతాయని, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు, రైతులు పంటలు సాగు చేసుకునేందుకు దోహదపడతాయని అన్నారు. ఫార్మ్ పాండ్స్ నిర్మాణ లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేందుకు సంబంధిత అధికారులు మరింత కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో డీఆర్‌డీఓ భాస్కర్, అదనపు డీఆర్‌డీఓ పి. సూరి, ఎంపీడీవో విజయ శ్రీ, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,