మస్కట్ లో ఘనపూర్ వాసి ఇబ్బందులు
పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్
నిజామాబాద్ : నిజామాబాద్ డిచ్పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన బోశెట్టి రాంచంధర్ మస్కట్ లో అనేక ఇబ్బందులకు గురవుతున్నాడని పివైఎల్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వాసరి సాయినాథ్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఏజెంట్ కు లక్ష రూపాయలు ఇచ్చి రాంచందర్ మస్కట్ వెళ్ళాడన్నారు.అక్కడ చెప్పిన పని, జీతం లేదు. పోయిన కొత్తలోరెండు, మూడు నెలల జీతం కంపెనీ వారు ఇచ్చారు. ప్రస్తుతం జీతం ఇవ్వక 8 నెలలు అవుతుంది.దీంతో రాంచందర్ సమస్యలు ఎదుర్కుంటున్నాడని , లక్షన్నర కడితే పాస్పోర్ట్ ఇస్తా మంటున్నారని పనికి వెళ్లకుంటే కొడుతున్నారంటూ రాంచందర్ వాపోతున్నాడని సాయినాథ్ వివరించారు.తాను పడే ఇబ్బందులు చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో రాంచందర్ పోస్ట్ పెడుతున్న ఎవరు స్పందించండం లేదని సాయినాథ్ తెలిపారు.ఎమ్మెల్యే, ఎంపీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోని అక్కడ ఇబ్బందులు పడుతున్న రాంచందర్ తో పాటు మన వాళ్ళని స్వదేశానికీ రప్పించాలని,న్యాయం చేయాలనీ ప్రభుత్వానికి సాయినాథ్ విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


