సిఐటియు యూనియన్ లో చేరిన ఓఆర్ఆర్- హెచ్ఎండిఏ కాంట్రాక్ట్ కార్మికులు

సిఐటియు యూనియన్ లో చేరిన ఓఆర్ఆర్- హెచ్ఎండిఏ కాంట్రాక్ట్ కార్మికులు

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సిఐటియు యూనియన్ లో చేరిన శామీర్పేట -కీసర -ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న హెచ్ఎండిఏ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 62 మంది సిఐటియు యూనియన్ లో చేరడం జరిగిందని సిఐటియు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలియజేశారు. కీసర టోల్ గేట్ వద్ద హెచ్ఎండిఏ కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం  సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం కార్మిక చట్టాల అమలు కోసం కార్మికుల పక్షాన సిఐటియు అలుపెరుగని ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుందన్నారు .  కార్మికుల ప్రధాన డిమాండ్స్ :  ఔటర్ రింగ్ రోడ్డు - హెచ్ఎండిఏ పరిధిలోని కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలి.  కార్మికుల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లో ఒకటవ తేదీన జీతాలు వెయ్యాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కార్మికులందరికీ వారాంతపు సెలవులు అమలు చేయాలి. కార్మికులందరికీ తొమ్మిది రకాల సేఫ్టీ కిట్స్ అందజేయాలి.   అర్బన్ ఫారెస్ట్రీ ,,పార్కులు,ల ఇంజనీరింగ్ , పారిశుద్ధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. కాంట్రాక్ట్ కాల పరిమితి ముగించిన కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు కార్మికులందరినీ యధావిధిగా కొనసాగించాలన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు