విజయదశమి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ

కౌన్సిలర్ దంపతులు ధోనీకేల శిరీష నవీన్ సేవాభావం

విజయదశమి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ

మెట్‌పల్లి డివిజన్ :విజయదశమి పండుగను పురస్కరించుకొని మెట్‌పల్లి పట్టణంలోని 14వ వార్డు కౌన్సిలర్ ధోనీకేల శిరీష, బీజేపీ మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు నవీన్ దంపతులు తమ వార్డులో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. పండుగ వేళ కార్మికులను గౌరవిస్తూ వారికి వస్త్రాలు పంపిణీ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ దంపతులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పట్టణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ఎండా, వానా అనే తేడా లేకుండా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో గొప్పదని, వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పండుగలను అందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్మికులకు నూతన వస్త్రాలు అందించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డులో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న గంగారం, లక్ష్మి, నిజాముద్దీన్, రమేష్ తదితర కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు