మహా చండీ అవతారంలో అమ్మవారు
నల్లబెల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
నల్లబెల్లి, వరంగల్ జిల్లా : శ్రీ వాగ్దేవి యువజన కళా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారిని మహా చండీ అవతారంలో అలంకరించారు. పురోహితులు ఆచార్య గణేష్ శర్మ ధూప, దీప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.మహా చండీ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక హారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ నిర్వహిస్తున్న అమ్మవారి విభిన్న అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.ఈ పూజా కార్యక్రమంలో శ్రీ వాగ్దేవి యువజన కళా సంస్థ ప్రతినిధులు, పూజా కార్యక్రమాల దాతలు, మాలధారణ భక్తులు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


