జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు 

జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు 

బాల్కొండ (నిజామాబాదు ) విజన్ ఆంధ్ర (ఆర్. సి)అక్టోబర్ 14:- నిజామాబాదు జిల్లా బాల్కొండ లో ఉన్న శ్రీ నిమిషంభ దేవి అమ్మ వారి నవరాత్రి ఉత్స వాల్లో భాగంగా బుధవారం రోజున సోమక్షత్రియ నకాష్ సంఘం భీంగల్ కు చెందిన 50 మంది మహిళా మణులు ప్రత్యేక పూజలతో పాటు ఒడి బియ్యాలు సమర్పించు కున్నారు.అనంతరం అమ్మవారి సన్నిధిలో కోలాటాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ శ్రీ నింషాంబ దేవి ఆలయానికి చెందిన సేవకులైన భ్రమరోతు గంగాధర్ నర్సింగ్ రావు కమల్ వర్మ, నవనీత్, డా, పవన్ కుమార్, సత్వావే సంతోష్ కుమార్ తదితరులు భక్తులకు ఆహ్వానం పలికి అమ్మవారి తరపున పండ్లు పొలాలను అందించారు.

 "అలకొండ పురి రమ్య నగై: నవబి రావృతా !తత్రేషా తు మహాదేవి నిమిషాంబా ప్రతిష్ఠితా!! (తొమ్మిది ఏతైనా నల్ల రాల్ల కొండల చేత చుట్టబడి ఉన్న అందమైన అల్లకొండ,వల్లకొండ, @ బాల్కొండలో కొలువై ఉన్న 
శ్రీ నిమిషంబ దేవి నిత్య నైవేద్య పూజలను అందు కుంటూ ఉంది. అల్లయ్య కొండయ్య సామ్రాజ్యంలో రాజస్థాన్ రాష్ట్రం నుండి  శ్రీ సోమ క్షత్రియులు అల్లాకొండ కు వచ్చేటప్పుడు శ్రీ నిమిషంబ దేవి పంచంలోహ విగ్రహాన్ని 1059 లో తీసుక వచ్చి కుల గురవైన గోవిందయ్య నేతృత్వంలో పూజలు జరిగాయని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తుంది.బాల్కొండ లో పూర్వం నుండే అనగా అక్టోబర్ 2026 నాటికీ (967) సంవత్స రాలుగా నిత్య నైవేద్య పూజలు కొనసాగడం విశేషం పైగా భారత దేశంలోనే 4 వ ఆలయంగా ప్రసిద్ధి.ఇది ఇలా ఉండగా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా  ఈ నెల 16 శుక్రవారం టోకెన్ నేం (81) హైదరాబాద్ లోని సైనిక పురికి చెందిన ధనలకోట భూపతి వర్మ జ్యోతి, మనోజ్,స్వప్న, వి. వినేద్ర వర్మ,సౌమ్య వై. అరన్ కుమార్, స్రవంతి కుటుంబం వారిచే "అన్నదానం' నిర్వ హిస్తున్నా రని ఆలయ సేవకులు బి. గంగాధర్ తెలిపారు.మహాదానం"అన్నదానం చేస్తే పుణ్యఫలం, ఆకలితో ఉన్న వారికి అన్నం దానం చేయడం వల్ల "నిత్యం అన్నపూర్ణ " కొలిచినట్లే కాకుండా ఆ ఇంట్లో సిరి సంపాదలకు నిలయంగా మారు తుందని ఆలయ సేవకులు బి. ఆర్. నర్సింగ్ రావుఈ సందర్బంగా విజ్ఞప్తి చేసారు.ఆలయంలో పనులకు చేయూత ఇవ్వండి ఈ ఆలయంలో పలు అభివృద్ధి పనులు జరుగా నున్నాయని (1).ఆలయంలో ఉత్తర దక్షిణ సింహ ద్వారం పనులు.(2).శ్రీ నిమిషంబ దేవి కల్యాణ మండపం నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతున్నాయని అమ్మ వారి భక్తులు పంపే కానుకలు " శ్రీ నిమిషంబ దేవి టెంపుల్ డెవలప్మెంట్ సొసైటీ " అకౌంట్ నుంబర్ 073710011109628 యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా "బాల్కొండ " నిజామాబాదు బ్రాంచి ఐ. ఆఫ్. ఎస్.సి. నేం.యి.బీ.ఐ.యన్. 0807371.లేదా క్యూ.. ఆర్. కోడ్ ద్వారా పంపి "స్క్రీన్ షాట్" ను 9666759297 నంబర్‌కు పంపాలని ఆలయ సేవకులు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు కోరారు. అన్న దానానికి ఖాళీలు2026, నవంబర్ నుండి 2026 డిసెంబర్  వరకు ప్రతి నెల   మొదటి శుక్రవారాల్లో అన్నదానం చేయాలనుకు నే కుటుంబాలు తమ కుటుంబ పేర్లు, గోత్రాలు మరియు కుటుంబ సమూహ ఫోటోలతో 9666759297 నంబ ర్‌కు ఫోన్ చేసి టోకెన్ నంబర్    పొందాలని ఆలయ సేవకులు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు కోరారు.కనపడటం లేదు నేటి రోజుల్లో నారి మణుల్లో నుదుటన కుంకుమ,కళ్ళకు కాటిక, తలలో పూలు, అంద మైన వాలు జడ, చేతులకు గాజులు, ఒళ్ళు నిండా చీర, జాకెట్,కాళ్లకు మట్టేలు, కాకుండా నేటి స్త్రీలు నుదుటిన చిన్న టికిల్ బొట్టు, పెదవులకు లిఫ్టిక్,తల వెంట్రు కలు విర బూసిన వెంట్రుకలు, ఒళ్ళు కనిపించే విధంగా రెడీ మేడ్ వస్త్రా లను ధరించి ఆలయాల్లో కి వస్తే  ఆలయంలోకి ప్రవేశం లేదని తేల్చి చెప్పారు.ఈ క్షేత్రానికి ఏలా చేరుకోవాలిభారత దేశంలోనే 4 వ పంచంలోహ విగ్రహం తో కొలువై ఉన్న శ్రీ నిమిషంబ దేవిబాల్కొండలోనే కొలువై ఉందని పవిత్ర శక్తి స్వరూపిణి ఆలయం హైదరాబాద్ పట్టణానికి 200 కిలోమీటర్ దూరంలో హైదరా బాద్ -  నాగపూర్ జాతీయ రహదారిని ఆనుకొనే బాల్కొండ ఉందని,బస్సు రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు