అభివృద్ధి కొరకు స్పెషల్ ఫండ్ ఇవ్వాలి
26వ డివిజన్ లో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ : నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 26వ డివిజన్ లో చేపట్టే రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఏడాది కార్పొరేషన్ లో పాలక వర్గం లేకపోవడం, కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో నిధులు లేవన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్ కు రూ. 20 లక్షలు కేటాయించారన్నారు. వీటితో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు అలాగే ప్రతి డివిజన్ కు కోటి రూపాయల పనులు కూడా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్, ఖిల్లా రామాలయంలో రోప్ వే కు డీపీఆర్ కూడా సిద్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, స్థానిక కార్పొరేటర్ బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


