మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నీళ్లు,నిధులు,నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ప్రాంతాల మధ్య విభేదాలు వద్దు.

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:

నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు,జల వివాదాలు, కరువు పరిస్థితులు,విద్యుత్ సమస్యలు,రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ"నీళ్లు,నిధులు,నియామకాల కోసం ఆనాడు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.ఎంతోమంది త్యాగాలు,పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో నేడు జిల్లాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొందరు వ్యవహరించడం బాధాకరం.ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది"అని అన్నారు.మహబూబ్‌నగర్,నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం జరిగిందన్నారు.ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి రోజుకు1.5 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాంతానికి,0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.అయితే ఈ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ కొందరు మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.అనవసరమైన వివాదాలు సృష్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.నార్లాపూర్ నుంచి నీటిని తరలించాలంటే అదనపు ఖర్చుతో పాటు ఎక్కువ సమయంఅవసరమవుతుందని, అనుమతుల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు.నల్గొండ ఫ్లోరైడ్ సమస్య, డబ్ల్యూహెచ్ఓ సూచనలు నల్గొండ జిల్లా దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతమని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడాలంటే సురక్షితమైన తాగునీటితో పాటు సాగునీటి వసతులు కూడా అందుబాటులో ఉండాలని అన్నారు.ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు రాజకీయ,ప్రాంతీయ వివాదాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించాలి.
మహబూబ్‌నగర్,నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు పరస్పరం చర్చించుకుని, ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి ఏ జిల్లాకు ఎంత నీరు అవసరమోసామరస్యపూర్వకంగా నిర్ణయించుకోవాలని సూచించారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని రెండు జిల్లాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు,సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారని,జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిందని వివరించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూనీటిని,విద్యుత్‌ను పొదుపుగావినియోగించుకోవాలని,ముఖ్యంగా రబీ సీజన్‌లో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.రాష్ట్ర ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యం కావాలని,జిల్లాల మధ్య వివాదాలకు తావులేకుండా పరస్పర సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు