కూకట్పల్లి ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన బండి రమేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: కూకట్పల్లి గ్రామంలోని ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టి పి సి సి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బండి రమేష్ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని, భక్తిభావాన్ని పెంపొందిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, గాలి బాలాజీ, గొట్టుముక్కల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


