దసరా సందర్భంగా కాలనీ కార్మికులకు ఘన సన్మానం
రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 మంది కార్మికులకు నగదు బహుమతులు
కూకట్ పల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, వివేకానంద నగర్ డివిజన్లోని రామకృష్ణ వీధిలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకుని కాలనీలో వివిధ శాఖల్లో సేవలందిస్తున్న సుమారు 50 మంది కార్మికులను ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా కాలనీలో పనిచేస్తున్న వాచ్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, వీధి దీపాల నిర్వహణ సిబ్బంది, వాటర్ వర్క్స్, డ్రైనేజీ, విద్యుత్ శాఖల కార్మికులను సన్మానించి నగదు బహుమతులు అందజేయడం గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతోందని తెలిపారు. కార్మికుల సేవల వల్లే కాలనీకి మంచి పేరు ప్రతిష్ఠలు వస్తున్నాయని, వారిని గౌరవించుకోవడం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
కార్మికులే మా బలం.. కాలనీవాసులే మా బలగం అని ఆయన అన్నారు. కార్మికులు, కాలనీవాసుల సహకారంతో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 40 సంవత్సరాలుగా కాలనీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అసోసియేషన్ కమిటీ సభ్యులకు, కార్మికులకు, కాలనీవాసులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అసోసియేషన్ కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడుతూ.. కాలనీవాసులు, కార్మికుల సహకారంతో అందరం సమష్టిగా పనిచేస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. పరస్పర సహకారం, ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెంగల్రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీధర్, జి. ప్రసాద్, సూర్యనారాయణ, కిషోర్, నారాయణ సింగ్తో పాటు కార్మికులు కుమార్, జవాన్, నాగరాజు, విజయ్ చారి, శ్రీనివాస్, యాకయ్య, అనసూయమ్మ, వెంకటమ్మ, ఆటో సురేష్, శీను, టైగర్ శీను, భాస్కర్, చల్లారావు తదితరులు పాల్గొన్నారు.సుమారు 100 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులు, కమిటీ సభ్యులు, కాలనీవాసులకు అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


