మహిళల ఆర్థిక సాధికారతకు సింగరేణి సేవా సమితి చేయూత

మహిళల ఆర్థిక సాధికారతకు సింగరేణి సేవా సమితి చేయూత

కొత్తగూడెం,  : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జీఎం (పర్సనల్) వెల్ఫేర్ & సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మూడు నెలలపాటు నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణా కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. బాబుక్యాంప్, పోస్ట్ ఆఫీస్ ప్రాంత మహిళలకు ఉచిత టైలరింగ్, ఎంసీ క్వార్టర్స్, సుజాత్‌నగర్ మహిళలకు ఉచిత మగ్గం వర్క్స్, ఎన్‌కే నగర్ మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణా తరగతులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల మహిళలు, పరిసర ప్రాంతాల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి ఉపాధి అవకాశాలు పొందాలనే లక్ష్యంతో సేవా సమితి ఈ వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తోందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన మహిళలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. మూడు నెలలపాటు జరిగే ఈ ఉచిత శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ, హైదరాబాద్ నుంచి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని తమతో పాటు మరికొందరికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించేందుకు కూడా సింగరేణి సంస్థ సహకారం అందిస్తుందని జి.వి. కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా 2024–25 సంవత్సరంలో వృత్తి శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీజీఎంలు కేసా నారాయణరావు, బి. శివకేశవరావు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ కె. శివకుమార్, వెల్ఫేర్ పీఏ కె. వరప్రసాదరావు, సేవా కో-ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవా సెక్రటరీ మాధవీ స్వర్ణలత, సేవా కో-ఆర్డినేటర్లు మునీలా, పుష్ప, రమాదేవి, అరుణ, పద్మావతి, దీప, శిక్షకులు, సేవా సమితి సభ్యులు, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ