ప్రతి ఓటు కీలకం.. ఎస్‌ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
మర్పల్లి(వికారాబాద్ జిల్లా) మండలంలోని సిరిపురం గ్రామంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ కన్వీనర్ చామల రఘుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల సురేష్, గూడెం రాములు యాదవ్ బీఎల్‌ఏల, కాంగ్రెస్ నాయకులతో, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ కన్వీనర్ చామల రఘుపతి రెడ్డి,మాట్లాడుతూ ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో విలువైనదని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని బీఎల్‌ఏలకు సూచించారు. ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక శ్రద్ధతో బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారని చామల రఘుపతి రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి అందజేస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిరిపురం ఉప సర్పంచ్ రత్నం, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరయ్య గౌడ్, లక్ష్మారెడ్డి, వీరారెడ్డి, ఆనందం తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
