సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హన్మకొండ న్యూస్ :హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనకు విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హెచ్ఐవి,టీబి, ఎస్ టి ఐ  ,రక్తదాన అవగాహన బైక్ ర్యాలీని శుక్రవారం ఐ డి ఓ సి హనుమకొండ నుంచి నిట్ హనుమకొండ వరకు జరిగే బైక్ ర్యాలీని  కలెక్టర్ చాహత్ బాజ్ పాయి జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీ ని ఉద్దేశించి  కలెక్టర్  మాట్లాడుతూ.  హెచ్ ఐ వి /ఎయిడ్స్ , స్టిస్పై  యువతలో అవగాహన పెంపొందించాలని...జిల్లా ని "సురక్షిత్  జిల్లా "గా రూపొందించేందుకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు.హెచ్ఐవి, ఎయిడ్స్, ఎస్ టి ఐ, టీబి, రక్తదాన శిబిరాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని టీబి& హెచ్ఐవి ఉన్నవారిని త్వరగా గుర్తించి న్యూట్రిషన్ కిట్స్ అందజేయాలని కోరారు.జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య  మాట్లాడుతూ. ప్రతి గర్భిణీ స్త్రీ మొదటి, రెండవ,మూడవ త్రైమాసికంలొ తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాల ని, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం 1097 కు కాల్ చేయవచ్చని తెలియజేశారు. హెచ్ఐవి సోకిన వ్యక్తులకు టీబి వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ రెండు వారాలకు మించి దగ్గు,జ్వరము దగ్గినప్పుడు రక్తం పడడం,అలసట, బరువు తగ్గడం, నీరసం,అన్నం తినాలనిపించకపోవడం లాంటి లక్షణాలు అవుపించినట్టయితే తప్పనిసరిగా టీబి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు.ఈకార్యక్రమంలో జిల్లా అడిషనల్ డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాధవరెడ్డి నెహ్రూ నాయక్ హీయో  సందెల శ్రీనివాస్, డీపీఎం  లు రవీందర్,దేవి సింగ్,సువార్త గ, సబ్ యూనిట్ ఆఫీసర్ విప్లవ కుమార్, జిల్లాలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలసూపర్వైజర్లు,   సిస్టర్లు హెల్త్ అసిస్టెంట్లు , సిబ్బంది, డీపీఎం  (దాపసు ) మాధురి, సిబ్బంది కమలాకర్, రామకృష్ణ యన్ జి ఓ   లు మారి వరంగల్, మారి భూపాలపల్లి ఎస్ . వై . ఓ , రెడమ్ , వర్డ్,  యమ్ ఐ పి ఆర్ ఈ, యన్ పి యస్ స్వచ్ఛంద సంస్థల ఉద్యోగులు, టీవీ హాస్పిటల్ కౌన్సిలర్ రాపర్తి సురేష్, కళాజాత బృందం పాల్గొన్నారు

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్