నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
- నిమజ్జన ఉత్సవాలలో డీజేలకు అనుమతి లేదు.
- మండపాలలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
- ప్రింట్ మీడియా, శాంతినగర్, ఖానాపూర్, క్రాంతి నగర్, గణపతి మండపాల ను దర్శించిన జిల్లా ఎస్పీ.
- గణపతి నిమజ్జన కార్యక్రమాలను సరైన సమయంలో పూర్తి చేయాలి.:జిల్లా ఎస్పీ అఖిల్ మహ
ఆదిలాబాద్ జిల్లా : గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నందు ప్రశాంత వాతావరణంలో జరగడానికి యువతతో నేరుగా మాట్లాడుతూ పోలీసు ప్రజల సత్సమండాలను మెరుగుపరచడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన గణపతి మండపాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దర్శించి పూజా కార్యక్రమాల నిర్వహించి గణనాథుని సేవలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లోని ప్రింట్ మీడియా గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, ఖానాపూర్, గందేవార్ తోట ప్రాంతాలలోని పలు ప్రధాన గణపతి మండపాలను, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంతి నగర్, భాగ్యనగర్, మహాలక్ష్మి వాడ లోని పలు ప్రధాన గణపతి మండపాలను దర్శించి గణపతి మండప కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడి నిమజ్జనాన్ని సరైన సమయంలో పూర్తి చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దాదాపు పట్టణంలోని 10 మండపాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మండపాల వద్ద జిల్లా ఎస్పీ గారిని ఘనంగా సత్కరించిన గణపతి మండప కమిటీ సభ్యులు. మండపాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమర్జనం ఉత్సవాలలో ఎలాంటి డీజే లకు మరియు లేజర్ లైట్ లకు, పేపర్ చెల్లె యంత్రాలకు అనుమతి లేదని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100/112 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. గణపతి నిమర్జనాన్ని సరైన సమయంలో పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి మురళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


