డీజే అడ్వాన్స్ వివాదానికి పోలీసుల పరిష్కారం!

డీజే అడ్వాన్స్ వివాదానికి పోలీసుల పరిష్కారం!

  • మద్నూర్ పోలీసుల చొరవతో ఉత్సవ నిర్వాహకులకు రూ.5 వేల అడ్వాన్స్ తిరిగి
  • ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించిన ఎస్సై మోహన్ రెడ్డి

మద్నూర్, : గణేష్ నిమజ్జన కార్యక్రమంలో డీజేకు అనుమతి లేకపోవడంతో డీజేను రద్దు చేసుకున్న ఉత్సవ నిర్వాహకులకు మద్నూర్ పోలీసులు న్యాయం చేశారు. మరేపల్లి గ్రామంలోని ఏకదంత గణేష్ మండలి నిర్వాహకులు రెండు నెలల క్రితం ఖండేబల్లూర్‌కు చెందిన డీజే నిర్వాహకుడికి రూ.5 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ఇటీవల డీజేలకు అనుమతి లేదని పోలీసులు సూచించడంతో నిర్వాహకులు డీజేను రద్దు చేసుకున్నారు. అయితే చెల్లించిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్సై ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం డీజే నిర్వాహకుడి నుంచి రూ.5 వేలు అడ్వాన్స్‌ను ఉత్సవ నిర్వాహకులకు తిరిగి ఇప్పించారు. గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్