22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం

22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం

దౌల్తాబాద్‌, సిద్దిపేట: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో కేసీఆర్‌ కుటుంబ భూముల అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తెరపైకి తేవడం రాజకీయ దృష్టి మళ్లింపు వ్యూహమేనని దౌల్తాబాద్ మాజీ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సయ్యద్‌ రహీమొద్దీన్‌ అన్నారు. 22ఏ వల్ల భూములు రిజిస్ట్రేషన్లు కాక రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ భూముల్లో అక్రమాలు జరిగి ఉంటే మూడేళ్ల క్రితమే రెవెన్యూ విచారణ జరిపి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో భూముల లెక్కలు వెల్లడించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ మైలేజీ కోసం చేసిన ప్రకటనగానే మిగిలిపోతుందని రహీమొద్దీన్‌ అన్నారు.

Views: 58

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు
టూ టౌన్ పాత పోలీస్ స్టేషన్ వెనుక ఉత్సాహంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాలు అధిక సంఖ్యలో హాజరైన మహిళలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ...
విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు
మర్రిగూడ మండలంలో విషాదం.
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు