నరేంద్ర మోదీ 76వ జన్మదినం

శ్రీరాంపూర్, నస్పూర్‌లో ఘనంగా ఆశీర్వాద దీపం

నరేంద్ర మోదీ 76వ జన్మదినం

నస్పూర్(మంచిర్యాల): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీరాంపూర్ మరియు నస్పూర్ జోన్లలో ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సూచనల మేరకు శ్రీరాంపూర్ జోన్ అధ్యక్షుడు సత్రం రమేష్, నస్పూర్ జోన్ అధ్యక్షుడు కుర్ర చక్రవర్తి సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మితమైన నేషనల్ హైవేపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలు వెలిగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్