గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాకు షెడ్యూల్ విడుదల

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాకు షెడ్యూల్ విడుదల

  • మళ్లీ ఫారం–18తో దరఖాస్తు చేయాలి
  • డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా

అక్కన్నపేట, : తెలంగాణలో 2027 మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నట్లు రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఓటర్ల జాబితా ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 28న ప్రజా నోటీసు జారీ చేయనున్నారు. అక్టోబర్ 15న తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ జరుగుతుంది. నవంబర్ 6 వరకు ఫారం–18 దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 25న క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేరు ఉన్న గ్రాడ్యుయేట్లు కూడా కొత్తగా ఫారం–18లో మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాల ధృవీకరించిన కాపీలను సమర్పించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో CEO తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా లేదా సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద ఫారం–18తో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన గ్రాడ్యుయేట్లు షెడ్యూల్‌ను గమనించి, నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి కోరారు. 

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్