విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి.
సీఎం సమీక్షకు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాదు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి విమానాశ్రయ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతి, భూసేకరణ, సర్వే తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి అవసరమైన అన్ని వివరాలు, నివేదికలను తాజా సమాచారంతో సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ, సర్వే తదితర ప్రక్రియలను వేగవంతం చేసి, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలను సకాలంలో చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, సర్వే శాఖ ఏడీ ప్రభాకర్, ఏవో వర్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


