గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు

మెడికల్‌ ప్రవేశాల్లో సత్తా చాటిన బాలాజీ, సింధు

గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు



పెద్దపల్లి టౌన్. : పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు వైద్య విద్యలో ప్రతిభ చాటారు. మెడికల్‌ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా పి. బాలాజీ 1326 ర్యాంకు, పి. సింధు 2889 ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు. దీంతో గాయత్రి జూనియర్ కళాశాల కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యాసంస్థల చైర్మన్‌ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. సాధారణ స్థాయి నుంచి వచ్చిన విద్యార్థులను అత్యున్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ, విద్యతో పాటు వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించే స్థాయికి తీర్చిదిద్దడమే గాయత్రి విద్యాసంస్థల లక్ష్యమని తెలిపారు. భవిష్యత్‌లో వైద్యులుగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు బాలాజీ, సింధు మాట్లాడుతూ కళాశాల అధ్యాపకులు అందించిన మార్గదర్శకత్వం, సూచనలు, మెలకువలు తమ విజయానికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు గాయత్రి విద్యాసంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపాల్‌ సురేష్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు
టూ టౌన్ పాత పోలీస్ స్టేషన్ వెనుక ఉత్సాహంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాలు అధిక సంఖ్యలో హాజరైన మహిళలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ...
విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు
మర్రిగూడ మండలంలో విషాదం.
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు