హత్య సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

హత్య సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్ :నిజామాబాద్ నగరంలో టౌన్-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన సంఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్   హత్యకు దారితీసిన పరిస్థితులు, సంఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలు తదితర అంశాలపై పోలీస్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి , కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా మరియు వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించడం , సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం, ప్రత్యక్ష సాక్షులు మరియు సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించడం వంటి దర్యాప్తు చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్  అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంఘటన స్థలంలో అవసరమైన పోలీస్ బందోబస్తు మరియు పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ శ్రీనివాసరాజ్ , టౌన్ 2 ఎస్సై యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

WhatsApp Image 2026-09-18 at 10.20.30 AM (1)

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్