టీఎన్జీవో హౌసింగ్ కాలనీలో ఘనంగా గణనాథునికి అన్నదానం

టీఎన్జీవో హౌసింగ్ కాలనీలో ఘనంగా గణనాథునికి అన్నదానం

  • ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలి:
  • టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

నస్పూర్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా గురువారం నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడవ రోజు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ, TGEJAC జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి - పల్లవి దంపతుల సౌజన్యంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముందు గడియారం శ్రీహరి-పల్లవి దంపతులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు రావలసిన నూతన పీఆర్సీ (పిఆర్ సి), 6 పెండింగ్ డీఏలు (డిఎ), ఓపీఎస్ (ఓపిఎస్), ఈహెచ్ఎస్ (ఎన్ఈహెచ్ఎస్), పెండింగ్ బిల్లుల సమస్యలు ఆ గణనాథుని ఆశీస్సులతో త్వరలోనే పరిష్కారం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కాలనీలో నవరాత్రులు ముగిసేవరకు దాతల సహకారంతో ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం సేవా దృక్పథంతో అన్నదానం చేపట్టిన గడియారం శ్రీహరి - పల్లవి దంపతులను, ముఖ్య అతిథి TGEJAC జిల్లా సెక్రటరీ జనరల్ వనజా రెడ్డిని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు రాచకొండ గోపాలరావు (10వ డివిజన్), సుదమల్ల హరికృష్ణ (11వ డివిజన్) మరియు కాలనీవాసులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, సైండ్ల మొండయ్య, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, తిరుపతి రెడ్డి, సునీత, ఎన్. సత్యనారాయణ, టి. తిరుపతి, ప్రసాద్, రాజేందర్, బెక్కం ఉషన్న తదితరులతో పాటు కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్