ఘనంగా విశ్వకర్మ భగవాన్ మహాయజ్ఞం

హాజరైన మేయర్ దర్ని మధుకర్

ఘనంగా విశ్వకర్మ భగవాన్ మహాయజ్ఞం

నస్పూర్(మంచిర్యాల): జిల్లా విశ్వకర్మ సంఘం, పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో రోజు నస్పూర్ కాలనీలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ భగవాన్ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విశ్వకర్మ కులస్థులు ఐక్యమత్యంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వారు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, స్థానిక కార్పొరేటర్లు మర్రి శ్రీలత రాజమొగిలి, తాళ్ళ సంపత్ రెడ్డి, విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి, జిల్లా, మండల ప్రతినిధులు మరియు కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్