తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళి అర్పించిన డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనుమకొండ న్యూస్ : తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను హనుమకొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా న్యూ శాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి, హక్కుల సాధనకు చాకలి ఐలమ్మ చూపిన చొరవ, ధైర్యం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బహుజనుల హక్కుల కోసం, భూమి కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ రజక సంఘాల ముఖ్య నాయకులు పాల్గొని వీరనారి ఐలమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


