ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
- కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.
- పోలీసు శాఖ తో పాటుగా విద్యుత్తు, మున్సిపాలిటీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ వివిధ శాఖ ల కృషి అభినందనీయం.
- నిర్విరాగంగా 12 రోజుల పాటు శ్రమించిన జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు.
- పెన్గంగా వద్ద నిమజ్జన ప్రక్రియ పరిశీలన.
- చివరి రోజు నిర్విరామంగా పనిచేసి నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.
ఆదిలాబాద్ : రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆదిలాబాద్ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాలను జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ 12 రోజులపాటు నిద్రాహారాలు మాని విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేసినందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంస్కృతి ప్రతి ఏటా కొనసాగాలని కోరారు. అదేవిధంగా 12 రోజులపాటు 24 గంటలు శ్రమించిన పోలీసు సిబ్బంది సివిల్, రిజర్వ్, హోంగార్డ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, క్యూఆర్టి, తెలంగాణ స్పెషల్ పోలీస్ వారికి అభినందనలుతెలియజేశారు. అదేవిధంగా 100 మంది ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సక్రమంగా విధులు నిర్వర్తించి తమ వంతు పాత్ర పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేశారు. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ పట్టణం, ఉట్నూర్, ఇచ్చోడ లాంటి ముఖ్యమైన పట్టణాలలో పూర్తిగా విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పూర్తి అయినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. చివరి రోజు రాత్రింబవళ్లు గణపతి నవరాత్రి ఉత్సవాలలో నిర్విరామంగా పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గణపతి ఉత్సవాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పెనుగంగ వద్ద ఉట్నూర్ ఎఎస్పి రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు పి మౌనిక ఐపీఎస్, బి సురేందర్ రావు, డిఎస్పీ ఎం వెంకట నర్సయ్య తో కలిసి నిమర్జనం ప్రక్రియను వేగవంతం చేసి సిబ్బందికి సూచనలు ఇస్తూ, నిమర్జనం పట్టణంలో పూర్తి చేయడం జరిగింది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


