పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ
నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు తేది: 26-09-2025 నాడు ఉదయం 11:00 గం||ల సమయంలో నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి వేడుకలు అదనపు డి. సి. పి ( అడ్మిన్ ) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ గారి ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం , అదనపు డి.సి.పి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఎ.సి.పి ( ఎ.ఆర్ ) కృష్ణ , పరిపాలన అధికారి ( AO ) శ్రీమతి ఆసియా బేగం , ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్ , వనమాల , జగతి , రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ , పోలీస్ కార్యాలయం సిబ్బంది , సి.సి.ఆర్.బి సిబ్బంది , సి.ఎస్.బి సిబ్బంది , ఐ.టి కోర్ సిబ్బంది , పోలీస్ కంట్రోల్ రూo సిబ్బంది , సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది తదితరులు హజరుకావడం జరిగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

