తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన: జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ 

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన:  జిల్లా ఎస్పీ  డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ 

నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS గారు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, అన్యాయంపై ఆమె సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ భూమినాది... పండించిన పంటనాది... తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీస్ కార్యాలయ ఏవో కృష్ణయ్య, ఆర్ఐ జగన్, ఎస్ఐలు రమేష్, వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఐలు ప్రశాంత్, గౌస్ పాషా, శివాజీలతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ