సుబ్బరాయుడు మలిశెట్టి జన్మదిన వేడుకలు
హైదరాబాద్:సీనియర్ జర్నలిస్టు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) మాజీ సభ్యులు, మాజీ APUWJ రాష్ట్ర సభ్యులు సుబ్బరాయుడు మలిశెట్టి 75వ జన్మదిన వేడుకలు అమెరికాలోని డాసన్‌విల్లేలో ఉన్న ఉడ్స్ అండ్ ఓక్స్ అట్ డాసన్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉడ్స్ అండ్ ఓక్స్ అట్ డాసన్ HOA అధ్యక్షుడు గణేష్ వల్లూరి, గాయత్రి, కోశాధికారి రవి పొట్లచెరువు, స్నేహ, శివకాంత్ పేట, మొగిలి వరలక్ష్మి, రాజా మహేష్ మలిశెట్టి, రమ్య భీమ, లోచన్ మలిశెట్టి, జి. కోటేశ్వరరావు, స్రవంతి, శ్రీనివాసులు తిమ్మనపల్లి, అరుణ, జయప్రకాష్, ఆయేషా, జియా, చందు, జయంతి, శ్రీధర్ మరియు పూజ తదితరులు పాల్గొని సుబ్బరాయుడు మలిశెట్టి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివకాంత్ పేట మరియు మొగిలి వరలక్ష్మి కలిసి సుబ్బరాయుడు మలిశెట్టి గారికి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే రవి పొట్లచెరువు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కటింగ్‌తో పాటు ఆత్మీయ సమావేశం నిర్వహించగా, వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా పలువురు శ్రీ సుబ్బరాయుడు మలిశెట్టి జర్నలిజం రంగానికి అందించిన సేవలను కొనియాడి, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, మరెన్నో సంవత్సరాలు సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో 75వ జన్మదిన వేడుకలు ఆత్మీయంగా, ఘనంగా ముగిశాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


