ముదిరాజ్ లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి

ముదిరాజ్ లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి

  • రాష్ట్రంలో ఎక్కువ జనాభా శాతం కలిగిన ముదిరాజులు
  • రేవంత్ రెడ్డి పై నమ్మకం విశ్వాసం ఉంది ముదిరాజులకు న్యాయం చేయాలి.
  •  వెల్దండ ముదిరాజ్ యువజన సంఘం మండల అధ్యక్షుడు బొక్కల శ్రీనివాస్ ముదిరాజ్

వెల్దండ: సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా వెనుకబడి ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలని వెల్దండ మండల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బొక్కల శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్దండ మండల కేంద్రంలో  శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొక్కల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ముదిరాజ్ లను బీసీ-ఏ లోకి చేర్చాలని కోరారు. జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం చట్టసభలో లేదని, రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద సామాజిక వర్గంగా, బీసీల్లో రెండో పెద్ద కులంగా ఉన్న ముదిరాజ్ లు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ లు 7.4 శాతం ఉన్నారు. అంటే దాదాపు 60 లక్షల మంది వరకు ఉన్నారని, గణాంకాలు చెబుతున్నా విద్య. ఉ ద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో తగిన వాటా దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న వేల మత్స్యకార సొసైటీల్లో 3,200 సొసైటీలు ముదిరాజ్ ల చేతుల్లోనే ఉన్నప్పటికీ, ఆర్థికంగా వారు నిలదొక్కుకోలేకపోతున్నారని తెలిపారు. పేదరికం కారణంగా ముదిరాజ్ బిడ్డలు కనీస డిగ్రీ కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారని, సాంకేతిక విద్య అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. బీసీ కమిషన్ ద్వారా సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఇది ఎవరికీ వ్యతిరేకమైన డిమాండ్ కాదని, సామాజిక న్యాయం కోసం చేస్తున్న న్యాయమైన పోరాటమని స్పష్టం చేశారు. ముదిరాజ్ సమాజం యొక్క సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితుల పై బీసీ కమిషన్ ద్వారా సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. జనాభా, ఉద్యోగాలు, విద్య, ఆర్ధిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగ బద్ధమైన విధానంలో న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని, కోర్టుల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాల్లో ముదిరాజ్ కులస్తులకు ప్రాధాన్యం కల్పించి, భావితరాలకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఈ వర్గం అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ