మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు 

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.దేశ ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమ రంగాల్లో మన్మోహన్ సింగ్ అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, సమాచార హక్కు చట్టం , విద్యా హక్కు చట్టం , మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  , జాతీయ ఆహార భద్రత చట్టం వంటి కీలక కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్–అమెరికా పౌర అణు ఒప్పందం వంటి కీలక నిర్ణయాలు కూడా ఆయన హయాంలోనే జరిగాయని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పదేళ్లపాటు దేశానికి సేవలందించారని, ఆయన హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని మంత్రి గుర్తుచేశారు. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 150కుపైగా విలేకరుల సమావేశాల్లో పాల్గొని మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అనేక కీలక విధానాలకు రూపకల్పన చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ