ప్రపంచంలోనే అరుదైన పథకం సీఎం బ్రేక్ ఫాస్ట్
మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి
సంగారెడ్డి డెస్క్ : ప్రపంచంలో అత్యంత అరుదైన పథకం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.శనివారం మెదక్ పట్టణంలోనీ మార్కెట్ యార్డ్ లో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత కిచెన్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు,జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తోకలిసిప్రారంభించారు. కేంద్రీకృత కిచెన్ యంత్రాలకు పరిశీలించి వాటి సామర్థ్యం ను అడిగితెలుసుకున్నారు. అనంతరం మెదక్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షనల్ లో ప్రభుత్వ విద్యార్థులకు అల్పాహారం వడ్డించి , విద్యార్థులతో పాటు కలిసి అల్ఫారాన్ని తిన్నారు. అల్పాహారం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అమలు చేస్తున్నామన్నారు. నాణ్యమైన, పౌష్టికరమైన అల్పాహారం అందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. హరికృష్ణ మూమెంట్ టీంకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి చదువుకోవాలన్నారు. పాఠశాలలకు మార్నింగ్ 8:30 కి టిఫిన్ వస్తుందనీ, రాష్ట్రవ్యాప్తంగా 36 కిచన్ లు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. ఇప్పటికే 10 వేల టీచర్స్ భర్తీ చేశాం అని,మెదక్ లో యంగ్ ఇండియా స్కూల్ ను 2,500 మంది విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తామన్నారు. మెదక్ కు100 కోట్ల తో పబ్లిక్స్ స్కూల్ కూడా వచ్చిందని, తెలంగాణలో 12 తరగతి విద్యార్థుల వరకు అల్పాహార పథకాన్ని అందిస్తామన్నారు. అల్పాహార పథకం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థుల కు ఇస్తున్నాం అని, టెక్నాలజీ కోసం నూతనంగా Atc సెంటర్ ప్రారంభించామని, అందులో శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా నాణ్యమైన , పౌష్టికాహారం అందించి, విద్య వైద్యం పై దృష్టి సారిస్తున్నామన్నారు. మెదక్ లో యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభించి మెదక్ విద్యార్థుల యొక్క భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షులు హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (హెచ్కెఎంసిఎఫ్) అధ్యక్షుడు, అక్షయ పాత్ర ఫౌండేషన్ (టిజి & ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షుడు హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస (ఎం.టెక్., ఐఐటి మద్రాస్), మాట్లాడుతూ... జిల్లాలో 30 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కేంద్రీకృత కిచెన్ ను మొదట కొడంగల్ లో ప్రారంభించామన్నారు. కొడంగల్ లో ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా కొడంగల్ పరిసర పాఠశాలలో 20% విద్యార్థులు అదనంగా పాఠశాలలో చేరుతున్నారన్నారు. కిచెన్ షెడ్ ను 40 రోజుల్లో పూర్తి చేశామన్నారు. జిల్లా ప్రజలందరూ సహకారంతో ముందుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, CEO HKMCF శ్రీ కౌంతేయదాస ప్రభుజి, పిఆర్ ఇన్చార్జి శ్రీ రవిలోచన దాస ప్రభువుజి ,మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, సంబంధిత ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


