వీరనారి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయం
- పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాటం ప్రతిఒక్కరికీ ఆదర్శం
- ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
- సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి డెస్క్ : చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పక్కన ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధపోరాటంలోధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జగదీష్, నాయకులు రామప్ప, నగేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


