కుక్కలు వద్దంటే కేసులు పెడతాం..!

కుక్కలు వద్దంటే కేసులు పెడతాం..!

కొత్తపల్లి: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్‌ సింహాద్రి కాలనీలో వీధికుక్కల సమస్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్‌ సిబ్బంది వచ్చి సుమారు 3 నుంచి 4 కుక్కలను పట్టుకెళ్లినట్లు కాలనీవాసులు తెలిపారు. అయితే తాజాగా పట్టుకెళ్లిన కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి తిరిగి సింహాద్రి కాలనీలోనే వదిలేందుకు సిబ్బంది రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 20 కుక్కలను కాలనీలోకి తీసుకొచ్చి వదిలేందుకు ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. వాటిని అడ్డుకున్న కాలనీవాసులకు, సంబంధిత అధికారులు ఫోన్‌ చేసి అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు వారు ఆరోపించారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల సమస్యపై ఫిర్యాదు చేసిన తమపైనే కేసుల బెదిరింపులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సింహాద్రి కాలనీలో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో కుక్కల బెడద మరింత ఎక్కువగా ఉంటోందని, ద్విచక్ర వాహనదారులను వెంటపడుతున్నాయని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతోనే ఇటీవల కొన్ని కుక్కలను పట్టుకెళ్లారని తెలిపారు. పట్టుకున్న చోటే విడిచే నిబంధన. వీధికుక్కల నియంత్రణకు జంతు జనన నియంత్రణ నిబంధనలు, 2023లో అమల్లో ఉన్నాయి. వీటి ప్రకారం కుక్కలకు స్టెరిలైజేషన్‌, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ చేసిన అనంతరం పట్టుకున్న అదే ప్రాంతంలో లేదా పరిధిలోనే తిరిగి విడిచిపెట్టాలి. ఇతర ప్రాంతాలకు తరలించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను అధికారులు పాటించాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కలపై తమకు వ్యతిరేకత లేదని, అయితే ప్రజల భద్రతకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు పేర్కొన్నారు. కేవలం కుక్కలను ఒకచోట నుంచి మరోచోటికి తరలించడం కాకుండా స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ వంటి చర్యలను నిబంధనల ప్రకారం చేపట్టాలని కోరారు. 20వ డివిజన్‌లో వీధికుక్కల సమస్యను సమగ్రంగా పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్‌ అధికారులను డిమాండ్‌ చేశారు.

WhatsApp Image 2026-09-26 at 12.12.18 PM

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ