చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్ డిచ్పల్లి రూరల్: దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆమెకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు శనివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె నిర్భయంగా పోరాడారని పేర్కొన్నారు. సామాజిక వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


