రెండు కోట్లతో బస్టాండ్ సుందరీకరణ చేసిన రెండు సంవత్సరాలు గడవకముందే కూలిన బస్టాండ్ పైకప్పు
కాంట్రాక్టర్ నాసిరకం పనులు అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ కరీంనగర్ సిద్దిపేట హనుమకొండ జనగాం నాలుగు జిల్లాల మధ్య చుట్టూ వంద గ్రామాల ప్రజలు ప్రతిరోజు వేల సంఖ్యలో నిత్యం విద్యార్థులు వ్యాపారస్తులు ప్రయాణికులు హుస్నాబాద్ నుంచి ప్రయాణం చేస్తుంటారు.ఎప్పుడో 83లో నిర్మించిన బస్టాండ్ కావడముతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా హుస్నాబాద్ బస్టాండ్ ఉండాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా రెండు కోట్ల నిధులు కేటాయించి సంవత్సరన్నర క్రితం బస్ స్టాండ్ ని సుందరీకరణ పనులతో బస్టాండ్ అభివృద్ధి చేయించారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతొ కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా పనులు చేసి తూతూ మంత్రముగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడు.
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బస్టాండ్
పైన ఉన్న సీలింగ్ పై కప్పు గురువారం సాయంత్రం ఏడవ నెంబర్ ఫ్లాట్ ఫామ్ వద్ద ఒక్కసారిగా సీలింగ్ పై కప్పు పెచ్చులు పెచ్చులుగా కూలిపోయింది.ఆ సమయంలో ఆ ఫ్లాట్ ఫామ్ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణప్రయాణం తప్పింది. బస్టాండ్ లోపల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం చిన్న చిన్న సమస్యలను గుర్తించకపోవడంతో ఎక్కడ చూసినా చిన్న వర్షానికి లీకేజై నీరు కారుతుంది.ఎంట్రెన్స్ బాల్కనీలో కూడా నీరు నిలిచిపోయి కూలిపోయే దశలో ఉన్నది.రెండు కోట్ల నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిర్లక్ష్యంగా నాణ్యత లేకుండా పనులు చేయడంతో బస్టాండ్ నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి.గత కొన్ని రోజులుగా సీలింగ్ కూలిపోయే దశలో ఉన్నదని బస్టాండ్ వర్షం వస్తే లీకేజీ సమస్య ఉన్నదని అధికారులకు తెలిసిన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వర్షం వస్తే బస్టాండ్ చుట్టూ డ్రైనేజీ సమస్యతో పాటు వరద నీళ్లునిలుస్తుండడం, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని దీనికి తోడు బస్టాండ్ సీలింగ్ కూలడంతొ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు స్పందించి బస్టాండ్ లో ఉన్న నాణ్యత లోపాలు గుర్తించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్టాండ్ అభివృద్ధిపై శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


