చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఆగమయ్య
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రానికి చెందిన రజక సంఘం నాయకుడు ఆగమయ్యను చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా రాష్ట్ర రజక సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆగమయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర రజక సంఘం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు, రజక సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆగమయ్య తెలిపారు. రాష్ట్రంలోని రజక సంఘం నాయకులు, సభ్యులను సమన్వయం చేసుకుంటూ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


