నేపు తంగడపల్లిలో మెగా జాబ్ మేళా 

నేపు తంగడపల్లిలో మెగా జాబ్ మేళా 

-50కి పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

నల్గొండ/మర్రిగూడ: నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 27వ తేదీన భారీ 'మెగా జాబ్ మేళా' నిర్వహించనున్నారు.ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు ఆసరా ఫౌండేషన్ సభ్యులు దామెర ఉత్తరయ్య వెల్లడించారు.చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న స్థానిక యువతకు ఈ మేళా ఒక అద్భుతమైన అవకాశమని నిర్వాహకులు తెలిపారు.కార్పొరేట్ రంగానికి చెందిన సుమారు 50 కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ డ్రైవ్‌లో పాల్గొని,అభ్యర్థుల విద్యార్హతలు,ప్రతిభ ఆధారంగా అక్కడికక్కడే ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నాయి.ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా ప్రతులతో పాటు,విద్యార్హత ధ్రువపత్రాల,జిరాక్స్, ఒరిజినల్స్,పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.మర్రిగూడ పరిసర ప్రాంతాలలోని అర్హులైన యువతీ యువకులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ