ఊరుకొండపేట ఉన్నత పాఠశాలకు అవోపా బీరువా బహూకరణ
- పాఠశాల అవసరాల కోసం సేవా కార్యక్రమం
- అవోపా సభ్యులను అభినంధన
కల్వకుర్తి కల్వకుర్తి అవోపా యూనిట్ ఆధ్వర్యంలో ఊరుకొండపేట ఉన్నత పాఠశాలకు శనివారం బీరువాను బహూకరించారు. పాఠశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవోపా సభ్యులు ఈ బీరువాను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అబ్దుల్ రహీం, అవోపా కల్వకుర్తి యూనిట్ అధ్యక్షులు కలిమిచర్ల రాఘవేందర్, కార్యదర్శి యాద శోభన్ బాబు, ఆర్థిక కార్యదర్శి కల్వ ఆంజనేయులు, సీనియర్ సభ్యులు గాదే కుమారస్వామి, పాలుట్ల జంగయ్యతో,కలిమిచర్ల కావ్య తో పాటు కల్వకుర్తి, ఊరుకొండ ప్రాంతాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అవసరాలకు ఉపయోగపడే విధంగా బీరువాను అందించిన అవోపా కల్వకుర్తి యూనిట్ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. విద్యాభివృద్ధికి తోడ్పడే సేవా కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


