వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

భూమి.. భుక్తి.. హక్కుల కోసం సాగించిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకం  ; కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ, ఆత్మగౌరవ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మహిళా శక్తికి ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు కలెక్టర్ హాజరయ్యారు. అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వం, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం సాగించారని తెలిపారు. భూమి, భుక్తి, హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం.. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం చూపిన మార్గం చిరస్మరణీయమన్నారు. సంఘ సేవకురాలిగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా ఐలమ్మ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో పేదలు, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజహితం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలియజేసేందుకు వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి ఐలమ్మను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఏం.రవీందర్, రజక సంఘ నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ