బిడ్డ ఎదుగుదలకు పోషకాహారం, తల్లిపాలు ఎంతో కీలకం

బిడ్డ ఎదుగుదలకు పోషకాహారం, తల్లిపాలు ఎంతో కీలకం

నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆవరణలో శుక్రవారం రాష్ట్రీయ పోషణ మాస వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి- మన బాధ్యత అనే నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిడిపిఓ సక్కుబాయి హాజరై మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో పోషకాహారంతో కలిగే ప్రయోజనాలు, సమతుల ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత, పరిశుభ్రత పాటించడం, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అధికారులు వివరించారు. తొలి వెయ్యి రోజుల బిడ్డ ఎదుగుదలకు పోషకాహారం మరియు తల్లిపాలు ఎంతో కీలకం అన్నారు. అనంతరం ఎంపీడీవో రామకృష్ణ శర్మ మాట్లాడుతూ ఆరోగ్యమే- మహాభాగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడి సెంటర్లకు వచ్చిన పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుని బాధ్యత అంగన్వాడీలది అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, అధికారులు, సర్పంచులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ