ఆలుబాక హైస్కూల్‌లో పిల్లల పార్లమెంట్ శిక్షణ కార్యక్రమం

ఆలుబాక హైస్కూల్‌లో పిల్లల పార్లమెంట్ శిక్షణ కార్యక్రమం

వెంకటాపురం : ములుగు జిల్లా,వెంకటాపురం మండల పరిధిలోని  కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలుబాక హైస్కూల్‌లో పిల్లల పార్లమెంట్ సభ్యులకు టాలెంట్ డెవలప్‌మెంట్, పుస్తక పఠనం,నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్.పి.పి.ఎస్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లూర్థురాజు పాల్గొని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా పిల్లలకు పిల్లల పార్లమెంట్ సభ్యుల బాధ్యతలు, నాయకత్వ లక్షణాలు, పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యాలు, బృందంగా పనిచేయడం, సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పిల్లలు ప్రతిరోజూ పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని, తమలోని ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని, పిల్లల పార్లమెంట్ ద్వారా గ్రామంలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాఫేడ్ సంస్థ  కోఆర్డినేటర్ గొంది హనుమంత్  ,కాఫేడ్  సంస్థ యానిమేటర్స్ ప్రశాంత్ ,నరేష్ ,ఉష ,ఇందిర ,పద్మ పాఠశాల ఉపాధ్యాయులు, నాగలక్ష్మి, సిహెచ్ షర్మిల, ప్రసాద్ ,రమేష్ ,రామదాసు పరమేశ్వరరావు, నాగర్జున ,రవి వర్మ, పిల్లల పార్లమెంట్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ