అన్నదాతకు అండగా నిలిస్తున్న రైస్ మిల్లర్ ల పై కక్ష సాధింపు తగదు.
ధర్నా ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి.
నిజామాబాద్ : అన్నదాతకు అండగా నిలుస్తున్న రైస్ మిల్లర్ ల పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సమంజసం కాదని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లపై దాడులకు నిరసనగా, ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి ప్రసంగించారు. కష్ట, నష్టాలకు ఓర్చుకొని ఇటు రైతంగానికి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న రైస్ మిల్లర్లపై రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 9 కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యంలో ఇప్పటికే 9 కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందన్నారు. కేవలం 10 లక్షల టన్నుల ధాన్యం కోసం వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇకనైనా ప్రభుత్వం మనసు మార్చుకొని రైస్ మిల్లర్లకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ఈ ధర్నా కార్యక్రమంలో మోటూరి దయానంద్ గుప్తా, జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్ లు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


