బిజినపల్లి మండలంలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

బిజినపల్లి మండలంలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

వీరవనిత పోరాట స్ఫూర్తిని చాటిన బీసీ, బహుజన నాయకులు

నాగర్ కర్నూల్  : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే - డా.బి.ఆర్.అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.ముందుగా పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన్నారు.

ఐలమ్మ పోరాటం - స్ఫూర్తి:
ఈ సందర్భంగా వక్తలు ఐలమ్మ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నిజాం కాలంలో రజాకార్లకు, విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి దౌర్జన్యానికి ఎదురు తిరిగిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు.1919లో వరంగల్ జిల్లా క్రిష్ణాపురంలో రజక కుటుంబంలో పుట్టిన ఐలమ్మ, తన భూమిని లాక్కోవాలని చూసిన దొరలపై కర్ర, రాళ్లతోనే తిరుగుబాటు చేసి తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని, ఆమె తెగువ నేటి మహిళా లోకానికి, బహుజన సమాజానికి ఆదర్శమని అన్నారు.ఈ జయంతి వేడుకలకు బీసీ సంఘం మండల అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య వక్తలుగా రాష్ట్ర నాయకులు పచ్చిపాల.సుబ్బయ్య, మేకల శివ యాదవ్,హాజరై ప్రసంగించారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ